మిర్చి పొలంలో గంజాయి సాగు

పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో గంజాయి సాగు వెలుగుచూసింది.

Published : 26 Mar 2023 04:13 IST

నిందితుల్లో వైకాపా నాయకుడి బంధువు

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో గంజాయి సాగు వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బాణావత్‌ అమరానాయక్‌, లావూరి శ్రీను నాయక్‌ కొంతకాలంగా మిరప పొలంలో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో శనివారం పిడుగురాళ్ల స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సీఐ కొండారెడ్డి, గురజాల సెబ్‌ ఎస్సై జయరాం సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. నిందితుల పొలాల్లో 10 కిలోల గంజాయి మొక్కలు, రెండు డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు 30 కిలోల గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అక్కడే సమీప ప్రాంతంలో మరో వ్యక్తి గంజాయి సేవిస్తుండగా సెబ్‌ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అమరానాయక్‌ వైకాపాకు చెందిన ఉప సర్పంచి నాగేశ్వరరావుకు స్వయాన సోదరుడు. అధికారపార్టీ అండదండలతో గంజాయి సాగు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని