సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి

సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్‌లో చోటుచేసుకుంది.

Published : 07 May 2024 06:24 IST

తమిళనాడులోని లేమూర్‌లో ఘటన

చెన్నై, న్యూస్‌టుడే: సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తిరుచ్చి ఎస్‌ఆర్‌ఎమ్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న సర్వదర్షిత్‌ (23), ప్రవీణ్‌శ్యాం(23), చారుకవి (23), గాయత్రి(25), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్‌(24) సహా మరో ఏడుగురు మిత్రులు ఆదివారం నాగర్‌కోవిల్‌లో జరిగిన ఓ వివాహంలో పాల్గొని సోమవారం ఉదయం లేమూర్‌ సముద్రతీరానికి వెళ్లారు. అకస్మాత్తుగా వచ్చిన పెద్ద అల వారిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు నీటమునిగి ప్రాణాలు కోల్పోపోవగా ప్రమాదం నుంచి బయటపడిన సర్వదర్షిత్‌  ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని