గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం

లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది.

Published : 07 May 2024 06:24 IST

ఐఈడీ, ఇతర పేలుడు పదార్థాల ధ్వంసం

గడ్చిరోలి: లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. దీంతో బాంబు నిర్వీర్య దళం, సీఆర్పీఎఫ్‌ బృందాలు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో తొమ్మిది ఐఈడీలు, మూడు క్లైమోర్‌ పైపులు, మేకులతో నిండిన మరో మూడు క్లైమోర్‌ పైపులు, డిటోనేటర్లు అమర్చిన ఆరు ప్రెషర్‌ కుక్కర్లు, గన్‌పౌడర్‌ వంటి పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని