గల్ఫ్‌ ఏజెంట్‌ భారీ మోసం

జిల్లాలో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ భారీ మోసానికి పాల్పడ్డాడు.

Updated : 26 Jan 2021 13:42 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ భారీ మోసానికి పాల్పడ్డాడు. యువకులను దుబాయి, బహ్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌ దేశాలకు పంపిస్తానని భారీగా డబ్బులు వసూలు చేసి చివరకు చేతులెత్తేశాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది యువకులను ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ విదేశాలకు పంపిస్తానని నమ్మబలికాడు.

ఈ మేరకు ఒక్కొక్క యువకుడి నుంచి సుమారు రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడు. అనంతరం నకిలీ వీసాలు, నియామక పత్రాలు ఇచ్చాడు. చివరికి తాము మోసపోయామని బాధితులు గ్రహించి ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి యువకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. తమ వద్ద నుంచి మొత్తం రూ.32లక్షల వరకు నగదు వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు.

ఇవీ చదవండి..
మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు 

సిక్కిం సరిహద్దుల్లో భారత్‌, చైనా జవాన్ల ఘర్షణ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని