Nizamabad: ఆర్మూర్‌లో కత్తితోవ్యక్తి హల్ చల్..!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. రాజారాంనగర్‌కు చెందిన లకన్ అనే యువకుడు..

Published : 26 Dec 2021 17:33 IST

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. రాజారాంనగర్‌కు చెందిన లకన్ అనే యువకుడు.. మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. మద్యం సేవించేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా.. అతడిని నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో రోడ్డుపైకి వచ్చి కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ప్రఫుల్ అనే వ్యక్తికి పొట్టలో కత్తి దిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కత్తిపోట్లకు గురైన ప్రపుల్‌ను ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని