Crime news: ముంబయి తాజ్‌ హోటల్‌ను పేల్చేస్తానని బెదిరించి.. అడ్డంగా దొరికిపోయాడు!

ముంబయిలోని (Mumbai) ప్రసిద్ధ తాజ్‌ హోటల్‌ను (Taj Hotel) పేల్చేస్తానని ఓ వ్యక్తి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశాడు. దాంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 15 Oct 2023 18:06 IST

ముంబయి: ముంబయి (Mumbai) అనగానే... గుర్తొచ్చే వాటిలో ఒకటి తాజ్‌ హోటల్‌ (Taj Hotel)! నవంబర్‌ 26, 2008న ఈ హోటల్‌పై ఉగ్రదాడి జరిగింది. అటువంటి చోట తాను బాంబు పెట్టానని ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. ఆ నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ధరమ్‌పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి శనివారం ముంబయి ఫైర్‌ బ్రిగేడ్‌కు ఫోన్‌ చేశాడు. తాను ప్రసిద్ధ తాజ్‌ హోటల్‌ను పేల్చేయబోతున్నానని సమాచారం ఇచ్చాడు. దాంతో వెంటనే ముంబయి పోలీసులు అలర్ట్‌ అయ్యారు. గంటలపాటు తాజ్‌ హోటల్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. అనుమానాస్పదంగా ఏమీ కన్పించపోవడంతో ఫోన్‌ కాల్‌ గురించి ఆరా తీశారు. 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

ఫైర్‌ బ్రిగేడ్‌కు ఫోన్‌ చేయడానికి ముందే నిందితుడు ధరమ్‌పాల్‌ పలుమార్లు ముంబయి పోలీసులకు ఫోన్‌ చేసినట్లు కనుగొన్నారు. దాంతో ముంబయిలోని కొలాబా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కూపీ లాగి ధరమ్‌పాల్‌ను అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ బాంబు బెదిరింపు పాల్పడటానికి గల కారణమేంటనే విషయంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని