Mumbai: బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డోంబివలీ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. 

Updated : 13 Jan 2024 19:19 IST

ముంబయి:  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో (Mumbai) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. డోంబివలీ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. లోధా పలావ టౌన్‌షిప్‌లోని ఫేజ్‌-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన  ఘటనా స్థలికి చేరుకొని పదిహేను అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పివేశారు.  మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 13వ అంతస్తులో చెలరేగిన మంటలు 18వ అంతస్తు వరకు వ్యాపించాయి. ఆ అపార్ట్‌మెంట్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. తొలి మూడు ఫ్లోర్లలో మాత్రమే కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.  ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే వాళ్లంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని