Crime news: బాలికపై తండ్రి, సోదరుడి అత్యాచారం.. తాత, బంధువు చేతిలోనూ..!

అభం శుభం తెలీని ఆ చిన్నారిని సొంతవాళ్లే కాటేశారు. కుమార్తె అని కూడా చూడకుండా తండ్రి.. వావి వరుసలు మరిచిన సోదరుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Published : 19 Mar 2022 20:48 IST

పుణె: అభం శుభం తెలీని ఆ చిన్నారిని సొంతవాళ్లే కాటేశారు. కుమార్తె అని కూడా చూడకుండా తండ్రి.. వావి వరుసలు మరిచిన సోదరుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. భుజాలపైకి ఎత్తుకు తిరగాల్సిన తాత సైతం లైంగిక వేధింపులకు పాల్పడగా.. ఓ దూరపు బంధువు సైతం వేయరాని చోట చేతులు వేస్తూ తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. తనపై నలుదిక్కులా ఈ ఘోరాలు జరుగుతున్నా ఏం జరుగుతోందో తెలీని దైన్యం ఆ చిన్నారిది. ఈ దారుణ ఘటన పుణెలో వెలుగు చూసింది. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత వరకు ఎవరినీ అరెస్ట్‌చేయలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ నుంచి వచ్చి పుణెలో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన బాలికపై గత కొన్నేళ్లుగా ఈ దారుణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె వయసు 11 ఏళ్లు. ఇటీవల పాఠశాలలో ‘గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌’ గురించి పాఠం చెబుతుండగా.. తనపై జరుగుతున్న దారుణాలను ఏకరవు పెట్టింది. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది. 2017 నుంచి ఆమె తండ్రి (45) ఆమెపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 2017లో బిహార్‌లో ఉన్నప్పటి నుంచే ఆమెను లైంగికంగా వేధిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అశ్విని సత్పుటే తెలిపారు. 2020 నవంబర్‌ నుంచి బాలిక పెద్దన్నయ్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు. తాత, దూరపు బంధువు సైతం తాకరాని చోట తాకుతూ వేధింపులకు గురి చేశారని ఫిర్యాదు అందిన్నట్లు తెలిపారు. అయితే ఒకరికి తెలీకుండా ఒకరు వేర్వేరుగా ఆ చిన్నారిపై ఈ దారుణాలకు ఒడిగడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నలుగురిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కూడా వివిధ సెక్షన్లను జోడించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని