Abdullapurmet Case: నవీన్‌ హత్య కేసులో.. పోలీసుల సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ కస్టడీ కొనసాగుతోంది.  ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీన్ రీకన్​స్ట్రక్షన్ చేసి హత్య జరిగిన తీరును పోలీసులు తెలుసుకున్నారు.

Updated : 04 Mar 2023 12:34 IST

హైదరాబాద్‌: నవీన్‌ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలో భాగంగా.. వరుసగా రెండో రోజు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 9 వరకు నిందితుడిని కస్టడీకి కోర్టు అనుమతించగా.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం హరిహరకృష్ణను ఈరోజు తెల్లవారుజామున ఘటనాస్థలికి పోలీసులు తీసుకెళ్లారు. హత్య చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.

నవీన్‌ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన అనంతరం హరిహరకృష్ణ లొంగిపోయినా.. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకోవడం వెనక.. ఎవరైనా సహాయం చేశారా.. సలహాలిచ్చారా.. అనే వివరాలు రాబట్టాల్సి ఉంది.

ఈ కేసులో నిందితుడు స్నేహితురాలుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు మూడుసార్లు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విచారించగా.. స్పష్టమైన సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది. కాగా చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న హరిహరను న్యాయస్థానం అనుమతితో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం సరూర్‌నగర్‌లోని ఎస్​ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లి తొలిరోజు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు