Crime News: షేర్‌ మార్కెట్‌లో నష్టాలొస్తే .. అప్పుల బాధ హంతకుడ్ని చేసింది!

ఆధారాలు దొరక్కుండా మహిళను హత్య చేసిన కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు.

Published : 06 Feb 2024 21:48 IST

 

తాడిపత్రి: ఆధారాలు దొరక్కుండా మహిళను హత్య చేసిన కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి జిల్లా అదనపు ఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. తాడిపత్రి నియోజకవర్గం పప్పూరు మండలంలో జనవరి 3న లక్ష్మీనారాయణమ్మ (52)హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు చంపి అరటితోటలో పూడ్చిపెట్టారు. తన చెల్లెలు కనిపించడం లేదని రమణయ్య పప్పూరు పీఎస్‌లో  ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది.

గ్రామానికి చెందిన చల్లా నరేంద్ర షేర్‌ మార్కెట్‌లో నష్టపోయి దాదాపు రూ.5లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. బాకీలు ఎలా తీర్చాలో తెలియక ఒంటరిగా ఉన్న లక్ష్మీనారాయణమ్మ మెడలో బంగారు గొలుసు లాక్కొనే ప్రయత్నం చేశాడు. తనను చూసిన ఆమె  విషయాన్ని గ్రామంలో చెబుతుందేమోనన్న భయంతో  బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా అరటితోటలో శవాన్ని పూడ్చిపెట్టాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన సర్కిల్‌ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి బంగారం గొలుసు, ఉంగరం, మొబైల్‌ స్వాధీనం చేసుకున్నట్టు అదనపు ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని