Jaipur Express: జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దారుణం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపుర్‌ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో కాల్పులు జరిగాయి.

Updated : 31 Jul 2023 13:29 IST

ముంబయి: జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Jaipur Express)లో దారుణం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపుర్‌ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో కాల్పులు జరిగాయి. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్‌ స్టేషన్‌ దాటి వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్‌ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. 

పదేళ్ల క్రితం తప్పిపోయిన భర్త అతడే అనుకొని..

‘జైపుర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. చేతన్‌ మొదట సీనియర్ అధికారి ఏఎస్సై టికా రామ్‌ మీనాను కాల్చి చంపాడు. తర్వాత మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దాంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైలు పాల్ఘర్‌ స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది’ అని ఆర్పీఎఫ్‌ అధికారులు వెల్లడించారు. 

కాల్పుల అనంతరం దహిసర్‌ స్టేషన్‌ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైలు ముంబయికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో బీ5 కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని