Telugu Akademi Scam: పదహారో నిందితుడు దొరికాడు

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాజేసిన కేసులో పదహారో నిందితుడు కృష్ణారెడ్డిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. తెలుగు అకాడమీకి చెందిన

Updated : 21 Dec 2022 16:26 IST

తెలుగు అకాడమీ ఎఫ్‌డీలు కొట్టేసిన ముఠాలో సభ్యుడు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాజేసిన కేసులో పదహారో నిందితుడు కృష్ణారెడ్డిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. తెలుగు అకాడమీకి చెందిన రూ.65.05కోట్ల ఎఫ్‌డీలను కొల్లగొట్టిన సాయికుమార్‌ ముఠాలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. తనవాటాగా రూ.6 కోట్లు తీసుకున్నాడు. పోలీసులు సాయికుమార్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్దిరోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్‌లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. సాయికుమార్, డాక్టర్‌ వెంకట్, నండూరి వెంకటరమణలతో కృష్ణారెడ్డికి మూడేళ్ల నుంచి స్నేహం ఉందని, రియల్‌ వ్యాపారాలు నిర్వహించాడని ఏసీపీ వివరించారు. తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సొంతానికి వినియోగించుకుంటున్న సమయంలోనే... సాయికుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగుల సంస్థ, ఆయిల్‌సీడ్స్‌ సంస్థలపై కన్నేశాడు. ఆరునెలల క్రితం ఆ సంస్థల్లోని నిధులు కాజేయాలని పథకం వేశాడు. బ్యాంక్‌ అధికారులతో మాట్లాడుకుని అంతా సిద్ధం చేసుకున్నాక కృష్ణారెడ్డిని పలుమార్లు విజయవాడకు పంపించాడు. అక్కడ బ్యాంక్‌ ఖాతాలను తెరిపించడం, బ్యాంక్‌ అధికారులతో మాట్లాడ్డం... ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాక  కృష్ణారెడ్డి ఎవరి వాటాలు వారికి పంపించడంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని