Crime news : నడి రోడ్డుపై కూలిపోయిన మలేసియా విమానం.. ప్రమాద దృశ్యాలు వైరల్‌

మలేసియాలో (Malaysia) ఓ చిన్న విమానం (Light Plane) నడిరోడ్డుపై కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. 

Updated : 23 Aug 2023 16:24 IST

కౌలాలంపూర్‌ : మలేసియా (Malaysia) సెంట్రల్‌ సెలంగర్‌ రాష్ట్రంలోని ఓ రద్దీ రహదారిపై విమానం (Light Plane) కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. లంగ్‌కావి ద్వీపం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో ఓ చిన్న విమానం గురువారం మధ్యాహ్నం బయలుదేరింది. సుల్తాన్‌ అబ్దుల్‌ అజీజ్‌ షా విమానాశ్రయం వైపు ప్రయాణం సాగిస్తుండగా అందులో సమస్య తలెత్తింది. దాంతో విమానం గాల్లో అస్తవ్యస్తంగా గింగిరాలు తిరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే అది నేల కూలింది.

ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి, మరో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో సెంట్రల్‌ పహాంగ్‌ రాష్ట్రానికి చెందిన చట్టసభ్యుడు జోహారీ హరున్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్‌బోర్డు కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై భారీగా అగ్ని వెలువడి, పరిసరాలను నల్లని పొగ కమ్మేసింది.

ప్రేమను తిరస్కరించిందని.. బాలికను 10 సార్లు కత్తితో పొడిచి..

ప్రమాదంపై మలేసియా ఎయిర్‌ఫోర్స్‌ మాజీ సభ్యుడు మహమ్మద్‌ శ్యామీ మహమ్మద్‌ హషీమ్ మాట్లాడుతూ విమానం అస్థిరంగా ప్రయాణించడం తాను చూశానని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత ఆ ప్రాంతంలో భారీ శబ్దం వెలువడిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. విమానం శకలాలు, ఓ మృతదేహం కాలుతూ కనిపించిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు