crime: ప్రేమను తిరస్కరించిందని.. బాలికను 10 సార్లు కత్తితో పొడిచి..

ఓ యువకుడు ప్రేమోన్మాదంతో దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను తిరస్కరించిందని ఓ బాలికను ఆమె తల్లి ముందే విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 17 Aug 2023 15:26 IST

ముంబయి: ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడి చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వారు తమ ప్రేమను ఒప్పుకోవడం లేదన్న అక్కసుతో కొంతమంది దుర్మార్గులు దాడులకు పాల్పడటం చూస్తున్నాం .. తాజాగా మరోసారి అలాంటి సంఘటన జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని 12 ఏళ్ల మైనర్‌ బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని  (Maharashtra) కల్యాణ్‌ జిల్లాలో జరిగింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  కల్యాణ్‌ జిల్లాలోని తిస్‌గావ్‌కు చెందిన ఓ బాలిక (12)ను ఆదిత్య కాంబ్లే  (20)అనే యువకుడు తరచూ ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అయితే ఆ అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోలేదని కోపం పెంచుకున్నాడు. బుధవారం సాయంత్రం ఆ బాలిక తన తల్లితో కలిసి ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా ఆమెపై దాడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించిందనే నెపంతో ఆమె తల్లి ముందే విచక్షణారహితంగా బాలికను 10 సార్లు కత్తితో పొడిచాడు. కత్తి పోట్లకు గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.  బాలికపై దాడి చేసిన తర్వాత నిందితుడు ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంబ్లే పై ముందుగా హత్య కేసు,  తర్వాత ఆత్మహత్యకు యత్నించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఉన్మాదంతో బాలికను చంపిన యువకున్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని