
Published : 22 Sep 2020 01:55 IST
కుప్పకూలిన విమానం.. పైలట్ మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లా కుష్వాపురవా గ్రామ సమీపంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందాడు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. ఈ విమానం శబ్ధం చేస్తూ కిందపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఘటన అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో శకలాలను తొలగించి పైలట్ మృతదేహాన్ని బయటకు తీశారు. దాన్ని శిక్షణ విమానంగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారంతోపాటు, విమానం ఏ శిక్షణ సంస్థకు చెందినదో తెలియాల్సి ఉందని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ వాగిష్ శుక్లా తెలిపారు.
Tags :