
Insta Reels: ఆ ఇన్‌స్టా రీల్.. ఆమె కొంపముంచింది
ఇంటర్నెట్ డెస్క్: వినోదం కోసం పక్కదారి పట్టిందామె. సరిగ్గా రెడ్ సిగ్నల్ పడినప్పుడు జీబ్రా క్రాసింగ్ మీదకు వచ్చి చిందులేసింది. ఆ వీడియోను కాస్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయినా.. చివరకు ఆమెను చిక్కుల్లో పడేసింది. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్రేయా కల్రా రీల్స్ చేయడమంటే అమితమైన ఆసక్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2లక్షలపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అభిమానులు చేయమన్న డేర్ ఛాలెంజ్ రీల్స్‌ని చేస్తుంటుంది. తాజా రెడ్ సిగ్నల్ పడినప్పుడు జీబ్రా క్రాసింగ్ మీదకు వచ్చి స్టెపులేసింది. అంతేకాదు..‘‘రూల్స్ బ్రేక్ చేయకండి- రెడ్ సిగ్నల్ వద్ద మీరు ఆగిపోవాలి ఎందుకంటే నేను డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి. మాస్కులు ధరించండి’’ అంటూ తన పోస్టు కింద రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె చేష్టలకు వ్యతిరేకించారు. ఇదికాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రూల్స్ అతిక్రమించి మరీ రీల్స్ చేస్తున్న వారందికీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇకపై అలాంటి వీడియోలు చేయకండంటూ హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.