logo

10,489 మందికి ఎన్నికల విధులు

లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్‌ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్‌లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు.

Published : 28 Mar 2024 03:24 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం

లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్‌ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్‌లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్ వేదికగా జిల్లాల వారీగా 55 శాఖల నుంచి ఉద్యోగుల సమాచారం తెప్పించి కంప్యూటర్‌లో క్రోడీకరించారు. ఆయా ఉద్యోగులకు ఎన్నికల సంఘం నుంచి సందేశాలు రావడం మొదలైంది.

ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో విధులు నిర్వహించాల్సిన ఎన్నికల ఉద్యోగుల సమాచారం సేకరణ పూర్తయ్యింది. ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే కౌంటింగ్‌, రిసెప్షన్‌ కేంద్రాలను గుర్తించారు. పార్లమెంటు పరిధిలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 10,489 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించారు. ఈ మేరకు వారికీ విధులు సందే10,489 మందికి ఎన్నికల విధులు ఉద్యోగ సమాచార సేకరణ పూర్తి శాలు నేరుగా ఎన్నికల సంఘం నుంచి వస్తున్నాయి.

55 శాఖలు.. 45 రకాల సమాచారం

దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కావడంతో అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అత్యవసర విభాగాలైన వైద్యం, ఆబ్కారీ, రవాణా, అగ్నిమాపక, పోలీసు విభాగాలు మినహా ఎన్నికల నిర్వహణకు 55 శాఖల ఉద్యోగులు ఈ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కానున్నారు. పీవో, ఏపీవో, ఓపీవోల కోసం ఆయా శాఖల్లో పని చేస్తున్న వారి వివరాలను  సేకరించారు. బేసిక్‌పేను బట్టి ఎవరిని పీవోగా, ఏపీవోగా, ఓపీవోగా నియమించాలో కూడా కార్యాచరణ సిద్ధం చేసి పెట్టారు. శాఖలవారీగా వచ్చిన సమాచారం సరైందా? కాదా? అని కూడా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి తెలుసుకోగా.. తాజాగా ఎన్నికల సంఘం సైతం ఫిబ్రవరి 8న విడుదలైన ఓటరు తుది జాబితా ప్రకారం ఉద్యోగుల ఎపిక్‌ నెంబరు సహాయంతో పార్ట్‌నెంబరు, సీరియల్‌ నెంబరు, పని చేస్తున్న నియోజకవర్గం, ఓటు వినియోగించుకోవాల్సిన నియోజకవర్గంతో పాటు చరవాణి నెంబరుతో కూడిన సందేశాలు సరైనవా కావా? కూడా మరోమారు ఆరా తీయడం ఎన్నికల నిర్వహణ ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారో స్పష్టమవుతోంది.


పోలింగ్‌ కేంద్రానికి నలుగురు చొప్పున

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి నలుగురు చొప్పున సిబ్బందిని నియమిస్తూ.. అదనంగా మరో 20 శాతం మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. నియోజకవర్గం వారీగా పోలింగ్‌ కేంద్రాలు, అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి.


ఫోన్లు చేస్తూ..

ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 45 రకాల వివరాలను సేకరించారు. పుట్టిన తేదీ మొదలుకొని, తీసుకునే మూలవేతనం, సొంత నియోజకవర్గం, పని చేస్తున్న జిల్లా, ఎపిక్‌ నెంబరు, పోలింగ్‌ కేంద్రం, చరవాణి నెంబరు వంటి వ్యక్తిగత సమాచారం క్రోడికరిస్తూ.. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తూ సమాచారాన్ని ధ్రువీకరించారు.


ఎన్నికల సంఘం నుంచి సందేశాలు

అధికార యంత్రాంగం సేకరించిన వివరాలల్లో ఏవైనా పొరపాట్లు దొర్లితే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారులను కలవాలంటూ నేరుగా ఎన్నికల సంఘం నుంచి ఇలాంటి సందేశాలు ఉద్యోగులకు వస్తున్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్‌ ఓటును వినియోగించుకునేలా ఆయా సందేశాలతో జాగ్రత్తలు తీసుకుంటోంది ఎన్నికల సంఘం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని