logo

శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం

కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు.

Published : 27 Apr 2024 12:30 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆర్యభట్ట ఇంటర్నేషనల్ పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళా నిలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూచిపూడి నృత్యం, కర్ణాటక గాత్ర సంగీతం, వీణా వాయిద్యం అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న గురువు కవిత వైద్యను అభినందించారు. విద్యార్థులు ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని చక్కగా సద్వినియోగించుకోవాలని, ఎంచుకున్న కళా రంగంలో ప్రావీణ్యం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సహాయ ఆచార్యుడు విజయబాబు, నృత్య శిక్షకురాలు హిమజ వైద్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని