logo

ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం

బాసర రైల్వే స్టేషన్‌లో నిజామాబాద్‌ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

Updated : 29 Mar 2024 06:27 IST

నందిని, శ్రీకాంత్‌

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర రైల్వే స్టేషన్‌లో నిజామాబాద్‌ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. యువతి మెడలోని గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను నిజామాబాద్‌ పట్టణంలోని ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన నందిని(20)గా వెంటనే గుర్తించారు. ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న యువకుడి వద్ద సెల్‌ఫోన్‌ మినహా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయన ఆచూకీ తెలుసుకోవడం కష్టమైంది. గురువారం ఉదయం సెల్‌ఫోన్‌ లాక్‌ తెరిపించి అందులోని కాల్‌డేటా ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు కాల్‌ చేశారు. దీంతో ఆయన నిజామాబాద్‌ పట్టణంలోని కోటగల్లికాలనీకి చెందిన శ్రీకాంత్‌(28)గా తేలిందని రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపారు. రైల్వే పోలీసులు, మృతుల సంబంధీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

శ్రీకాంత్‌ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. యువతి ఆనంద్‌నగర్‌లో ఉంటూ నిత్యం కళాశాలకు వెళ్లి వస్తున్నారు. ఇరువురి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు తమ ప్రేమను కాదంటారని భావించి కొన్ని రోజులుగా ఇరువురు దిగాలుగా ఉంటున్నారు. బుధవారం ఇద్దరు కలిసి బాసరకు వచ్చారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు కలిసి తిరిగారు. ఏం ఆలోచించారో కానీ రాత్రి 8.30 గంటలకు బాసర రైల్వేస్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు మృతదేహాలను మరణోత్తర పరీక్షల  నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.మృతుల కుటుంబ సభ్యులఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై చెప్పారు. ఈ ఆత్మహత్యలపై వారి కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని