logo

వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీం బాధ్యురాలు బి.సుశీల సూచించారు.

Published : 27 Apr 2024 18:56 IST

ఎదులాపురం: మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీం బాధ్యురాలు బి.సుశీల సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలోని జీనియస్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శనివారం ఆ బృందం ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ముట్టుకోవటానికి యత్నించినా, తదితరాలుగా వేధించినా, సైబర్ క్రైమ్‌కు పాల్పడినా.. వెంటనే 87126 59953 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు సత్యమోహన్రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని