logo

ఆర్మీ అభ్యర్థుల నిరసన

ఆర్మీలో చేరేందుకు వచ్చిన అభ్యర్థుల్లో కొందరు ధ్రువీకరణ పత్రాలు తీసుకురాలేదని  అధికారులు తిరస్కరించడంతో బాధితులు నిరసన వ్యక్తం చేశారు.

Published : 05 Oct 2022 02:47 IST

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం వద్ద నిరుద్యోగ అభ్యర్థులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఆర్మీలో చేరేందుకు వచ్చిన అభ్యర్థుల్లో కొందరు ధ్రువీకరణ పత్రాలు తీసుకురాలేదని  అధికారులు తిరస్కరించడంతో బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నిరుద్యోగ యువత కోసం గత నెలలో నగరంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించి ట్రేడ్‌మ్యాన్‌న్, హౌస్‌ కీపింగ్‌ పోస్టుల కోసం ప్రాథమికంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. కొన్ని పరీక్షలు నిర్వహించాక అవసరమైన సర్టిఫికెట్లు పరిశీలనకు తీసుకురావాలని సూచించారు. ఆ మేరకు అభ్యర్థులు మంగళవారం రైల్వేస్టేషన్‌ రోడ్డు సమీప ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం (ఏఆర్వో) వద్దకు వచ్చారు. వారిలో కొందరు కొన్ని ధ్రువపత్రాలు తీసుకురాక పోవడంతో అధికారులు వారిని వెనక్కి పంపగా కొద్దిసేపు నిరసనకు దిగారు. అధికారులు తమకు కొంత సమయం గడువు ఇస్తే వాటిని తీసుకువస్తామని, ఇందుకు అంగీకరించాలని సాయంత్రం వరకు నిరీక్షించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకొని సంబంధిత అభ్యర్థులకు సర్దిచెప్పి పంపించేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని