logo

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

మహిళా రక్షణ చట్టాలపై అవగాహన అవసరమని, వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని మహిళా సాధికారిక విభాగం జిల్లా కన్వీనర్‌ అశ్వినిరెడ్డి అన్నారు.

Published : 29 Nov 2022 01:18 IST

సమావేశంలో మాట్లాడుతున్న మహిళా సాధికారిక విభాగం జిల్లా కన్వీనర్‌ అశ్వినిరెడ్డి

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: మహిళా రక్షణ చట్టాలపై అవగాహన అవసరమని, వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని మహిళా సాధికారిక విభాగం జిల్లా కన్వీనర్‌ అశ్వినిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్‌ఎస్‌ఎస్‌, మహిళా సాధికారిక విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అశ్వినిరెడ్డి మాట్లాడుతూ బాలికల పట్ల వివక్ష చూపించడం తగదన్నారు. మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ చట్టం, దిశ యాప్‌ వంటివాటి ద్వారా భద్రత కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ చిట్టబ్బాయి, వైస్‌ ప్రిన్సిపల్‌ రసూల్‌, అధ్యాపకులు మురళీధర్‌రావు, అప్పలనాయుడు, ఐక్యూఏసీ సమన్వయకర్త కోటేశ్వరరావు, కుమారి, మహిళా సాధికారిక విభాగం సభ్యురాలు విజయలక్ష్మి, రాధాకుమారి, సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని