logo

ఆంగ్లంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

పిల్లలందరూ బాగా చదువుకోవాలని, ఆంగ్లంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. బుధవారం పాడేరు మండలం కొత్తబు, బర్సింగి, డోకులూరు, బొడ్డుమామిడి గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి బుధవారం ఆయన పర్యటించారు.

Published : 01 Dec 2022 03:17 IST

కొత్తబు పాఠశాలలో కలెక్టర్‌కు చిత్రపటం బహూకరించిన విద్యార్థులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పిల్లలందరూ బాగా చదువుకోవాలని, ఆంగ్లంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. బుధవారం పాడేరు మండలం కొత్తబు, బర్సింగి, డోకులూరు, బొడ్డుమామిడి గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా గబ్బంగి పంచాయతీ కొత్తబు గ్రామంలో కలెక్టర్‌, మండల పరిషత్తు నిధులు, గ్రామస్థుల శ్రమదానంతో పునర్నిర్మించిన పాఠశాల, అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఓ విద్యార్థి కలెక్టర్‌ చిత్రాన్ని పెన్సిల్‌తో గీసి ఆయనకు బహూకరించారు. గ్రామంలో థలసేమియాతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారి సీదరి దీక్షితకు పింఛను నిలిచిపోయిందని తెలుసుకున్న కలెక్టర్‌.. వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బర్సింగిలో కలెక్టర్‌ నిధులు రూ. 2.50 లక్షలు, గ్రామస్థుల శ్రమదానంతో పునర్నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం డోకులూరులో గ్రామస్థుల శ్రమదానంతో పునర్నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అక్కడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. డి.గొండూరు పంచాయతీ బొడ్డుమామిడి గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యమన్నారు. ఎంపీడీవో సాయినవీన్‌, ఎంపీపీ రత్నకుమారి, సర్పంచులు రాంబాబు, చిట్టిబాబు, సన్నిబాబు, జి నీలకంఠం, వి.రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు సన్యాసిరావు, చట్టమ్మ, పార్వతమ్మ, కనకాలమ్మ, మాజీ ఎంపీపీ మంగ్లన్నదొర, రమణమూర్తి, ఎంఈఓ సరస్వతిదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని