logo

గిరిజన గుమ్మం.. గుమ్మడితో సుసంపన్నం

గిరిజన ప్రాంతాల్లో గుమ్మడి కాయలదే అగ్ర తాంబూలం. గుమ్మడి లేకుండా గిరిజనులు గుమ్మం దాటరనే నానుడి ఉంది. గిరిజనులు వీటిని తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు తీసుకెళ్తారు.

Published : 24 Jan 2023 03:04 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల్లో గుమ్మడి కాయలదే అగ్ర తాంబూలం. గుమ్మడి లేకుండా గిరిజనులు గుమ్మం దాటరనే నానుడి ఉంది. గిరిజనులు వీటిని తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు తీసుకెళ్తారు. తమ ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే వారికి గుమ్మడినే బహూకరిస్తారు. ఇది గిరిజన సంప్రదాయంలో శుభసూచికంగా భావిస్తారు. గిరిజనులు పండిన గుమ్మడిని ఏడాది పొడవునా తమ ఇళ్లల్లో నిల్వ చేసి దాచుకుంటారు. దీనికోసం వారు రకరకాల పద్ధతులు ఆచరిస్తుంటారు. ప్రస్తుతం మన్యంలో గుమ్మడికాయలు దిగుబడికి వచ్చాయి. ఒడిశాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పది కిలోల బరువుండే కాయ సైతం రూ.50కు మించడం లేదు. మన్యం వారపుసంతల్లో ప్రస్తుతం వీటి అమ్మకాలు జోరందుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని