logo

పోతురాజుబాబు ఆలయంలో విగ్రహాల తొలగింపు

కల్యాణఫు లోవలోని పోతురాజుబాబు (శివుడు) ఆలయం గర్భగుడిలోని శివలింగం, పార్వతీ పరమేశ్వరులు, నందీశ్వరుడు విగ్రహాలను దేవాదాయ శాఖ అధికారులే పెకిలించి, వాటిని గుడిలో నుంచి తీసేయడంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2023 04:23 IST

గర్భగుడిలోని విగ్రహాలు తొలగించిన అనంతరం ఇలా..

రావికమతం, న్యూస్‌టుడే: కల్యాణఫు లోవలోని పోతురాజుబాబు (శివుడు) ఆలయం గర్భగుడిలోని శివలింగం, పార్వతీ పరమేశ్వరులు, నందీశ్వరుడు విగ్రహాలను దేవాదాయ శాఖ అధికారులే పెకిలించి, వాటిని గుడిలో నుంచి తీసేయడంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలోని విగ్రహాలను తొలగించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా అధికారులు వ్యవహరించారంటూ గురువారం పోతురాజుబాబు ఆలయం వద్ద ఆ ప్రాంత గిరిజనులు ఆందోళన చేపట్టారు. తమ పూర్వీకులు శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన శివుడి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు  ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, స్థానికులకు చెప్పకుండా ఎందుకు తొలగించారని వంశపారంపర్య ధర్మకర్త బొండా దేముడు కుటుంబీకులు కేదారి దేముడు నిలదీశారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవరాట వేశాక విగ్రహాలను కదపకూడదని, అటువంటిది ఉన్నఫళంగా విగ్రహాలను తొలగించడం అపచారమని ఆయన ఆక్షేపించారు. వార్డు సభ్యుడు కొత్తం అప్పారావు మాట్లాడుతూ పంచాయతీలో గిరిజనులు ఎవరినీ సంప్రదించకుండా విగ్రహాన్ని కూల్చివేయడం చాలా దురదృష్టకరమన్నారు. తొలగించిన విగ్రహాలను వెంటనే అక్కడి తిరిగి ప్రతిష్ఠించాలని ఆయన డిమాండు చేశారు. దీనిపై ఆలయ ఈఓ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పుడున్న పాత విగ్రహాలను తొలగించామని, అన్ని అనుమతులు తీసుకొనే విగ్రహాల తొలగింపు శాస్త్రోక్తంగా జరిపించామని చెప్పారు. త్వరలోనే కొత్త విగ్రహాలను ప్రతిష్ఠింపజేస్తామన్నారు.

ఆందోళన చేస్తున్న గిరిజనులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని