logo

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పేదలకు చేయూతనిస్తోందని అరకులోయ ఎమ్మెల్యే ఫాల్గుణ అన్నారు.

Published : 07 Feb 2023 03:43 IST

గృహసారథుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఫాల్గుణ

ముంచంగిపుట్టు, పెదబయలు, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పేదలకు చేయూతనిస్తోందని అరకులోయ ఎమ్మెల్యే ఫాల్గుణ అన్నారు. ముంచంగిపుట్టులో సోమవారం నిర్వహించిన ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని  సూచించారు. పేదల అభ్యున్నతిని ఆకాంక్షించే వైకాపా మరోసారి గెలిచేలా సమష్టిగా కృషి చేయాలని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సుభద్ర కోరారు. సుజనకోట పంచాయతీలోని సుజనపేట గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫాల్గుణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర పాల్గొని పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల వైకాపా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం గిరిజన విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. ముంచంగిపుట్టు జూనియర్‌ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరు కావడంతో కృతజ్ఞత సభ ఏర్పాటుచేశారు. ప్రిన్సిపల్‌ శ్రావణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, మల్లికార్జునరావు పాల్గొన్నారు.  

రాజవొమ్మంగి: రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ధనలక్ష్మి పేర్కొన్నారు. వంచంగి సచివాలయం పరిధిలోని వంచంగి, బలిజపాడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, తాగునీటి సమస్య పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్యేను కోరారు. ఎంపీపీ  వెంకటలక్ష్మి, సర్పంచి  కాంతం, ఉప ఎంపీపీలు సత్యచంద్రరాణి, రాజేశ్వరి, ఎంపీటీసీ సభ్యురాలు చిన్నాలమ్మ, సొసైటీ ఛైర్మన్‌ రామకృష్ణ, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు  మురళీకృష్ణ, ఎంపీడీవో బాపన్నదొర పాల్గొన్నారు.

చింతపల్లి గ్రామీణం: ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. తాజంగి పంచాయతీ చెరువువీధి, చీమలబయలు, తాళ్లకోట, బలబద్రం తదితర గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరు, సమస్యలను తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారానికి అవకాశమున్న వాటిపై అధికారులతో మాట్లాడారు. గృహసారథులు, వాలంటీర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించాలని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ఎంపీపీ అనూషాదేవి, సర్పంచి మహేశ్వరి, ఎంపీడీవో సీతయ్య, నాయకులు నర్సింగరావు, రవి తదితరులు పాల్గొన్నారు.

బలిజపాడులో సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని