logo

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గృహసారథులు, వాలంటీర్లు, కన్వీనర్లు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

Updated : 09 Feb 2023 05:42 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గృహసారథులు, వాలంటీర్లు, కన్వీనర్లు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం ‘నువ్వే మా నమ్మకం జగన్‌’ కార్యక్రమంలో భాగంగా అన్నవరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 97 సచివాలయాలు ఉన్నాయని, ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను నియమించామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా తనకు ఎంత బాధ్యత ఉందో.. ప్రజాప్రతినిధులుగా సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు అంతే ఉందని చెప్పారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చొక్కాకుల వెంకటరావు, ఎంపీపీ అనూషాదేవి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచులు లక్ష్మయ్య, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ రాజులమ్మ, నాయకులు రవి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: రింతాడలో గృహ కన్వీనర్లు, వాలంటీర్లతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గురువారం సమావేశం నిర్వహిస్తున్నారని వైకాపా మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్‌ తెలిపారు. కన్వీనర్లు, వాలంటీర్లు తప్పక హాజరవ్వాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని