logo

తెదేపా ఎమ్మెల్యేలపై దాడి దారుణం

శాసనసభ సమావేశాల్లో జీవో నంబరు ఒకటిని రద్దు చేయాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తుంటే.. వైకాపా ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తించి దాడి చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ధ్వజమెత్తారు.

Published : 21 Mar 2023 01:20 IST

రంపచోడవరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి, నాయకులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: శాసనసభ సమావేశాల్లో జీవో నంబరు ఒకటిని రద్దు చేయాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తుంటే.. వైకాపా ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తించి దాడి చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ధ్వజమెత్తారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం తెదేపా నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో వైకాపా నాయకులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెదేపా నాయకులు మరిచెట్ల వెంకటేశ్వరరావు, పెంటపాటి అనంతమోహన్‌, వై.నిరంజనీదేవి, ముచ్చు నాగేశ్వరరావు, దాకారపు సత్యనారాయణ, లంక హరిబాబు, సిద్దా వెంకన్నదొర తదితరులు పాల్గొన్నారు.

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: బ్రిటిష్‌ కాలం నాటి జీవో నం 1ను రద్దు చేయాలని శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే.. వైకాపా ఎమ్మెల్యే దాడులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. నిరసన తెలిపితే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దళిత శాసనసభ్యుడిపై దాడిని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారన్నారు. వైకాపా పతనం తప్పదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని