logo

కర్మఫలాన్ని దాటించేది భక్తిభావమే

ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని, అదే కర్మ ఫలాన్ని దాటిస్తుందని ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు.

Updated : 27 Mar 2023 05:39 IST

ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు

ప్రసంగిస్తున్న చాగంటి

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని, అదే కర్మ ఫలాన్ని దాటిస్తుందని ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. వివేకానంద ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అనకాపల్లి రావుగోపాలరావు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘భాగవత కథా శ్రవణం.. మానవ జన్మ సార్థకతకు సోపానం’ అంశంపై చాగంటి ప్రసంగించారు. భగవన్నామస్మరణ ఒక్కటే కష్టాలను తొలగిస్తుందన్నారు. భగవంతుని గురించి పోతన  భాగవతంలోని పద్యాలను ప్రతి ఒక్కరూ ధారణలో ఉంచుకోవాలన్నారు. భాగవతంలోని భీష్ముని పాత్ర, కొన్ని సంఘటనలతో సోదాహరణంగా వివరించారు. రెండు గంటలపాటు సాగిన ప్రసంగాన్ని అధిక సంఖ్యలో ప్రజలు ఆసక్తిగా ఆలకించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, విప్‌ కరణం ధర్మశ్రీ, పెందుర్తి శాసనసభ్యుడు అదీప్‌రాజ్‌ హాజరై... ఎంపీ బి.వి.సత్యవతితో కలిసి చాగంటిని సత్కరించారు.

కార్యక్రమానికి హాజరైన మంత్రి అమర్‌నాథ్‌, విప్‌ ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి తదితరులు

కార్యక్రమానికి హాజరైన ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని