logo

గంజాయితో ఇంజినీర్ల అరెస్టు

సీలేరు జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద పది కేజీల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ  తెలిపారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు.

Published : 04 Jun 2023 05:20 IST

స్వాధీనం చేసుకున్న గంజాయి, కారు, నిందితులతో పోలీసులు

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద పది కేజీల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ  తెలిపారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ధారకొండ నుంచి తెలంగాణ రాష్ట్రం రిజిస్ట్రేషన్‌తో కారు వచ్చింది. దాన్ని తనిఖీ చేస్తుండగా.. కారు నుంచి ఓ వ్యక్తి దిగి పారిపోయాడు. అందులో 10 కేజీల గంజాయి లభించింది. కారులో ఉన్న కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన మిగతా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి రెండు చరవాణులు, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారయ్యారని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని