ప్రయాణం.. పదిలమిలా
ఎండలో చిన్నారులతో ప్రయాణం ఇబ్బందే. తీవ్రమైన వేడితో కొన్నిసార్లు వడదెబ్బ తగిలే ముప్పు ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఎండలో చిన్నారులతో ప్రయాణం ఇబ్బందే. తీవ్రమైన వేడితో కొన్నిసార్లు వడదెబ్బ తగిలే ముప్పు ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
* ముఖ్యంగా ఉదయం 8 గంటల తర్వాత మధ్యాహ్నం 3 గంటలలోపు పిల్లలు, పెద్దలతో ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రైలు, బస్సుల్లో ప్రయాణించేవారు ఖర్చు ఎక్కువైనా సరే..ఏసీ సదుపాయం ఉండేలా చేసుకోవడం మేలు.
* ఎండ నేరుగా శరీరం, తలపై పడకుండా పెద్ద సైజు టోపీలు ధరించాలి. చలువ అద్దాలు పెట్టుకోవాలి. ప్రమాదకరమైన యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
* చర్మం దెబ్బతినకుండా ఎస్‌ఫీఎఫ్ 25 కంటే ఎక్కువ ఉన్న క్రీములను వాడొచ్చు. ముఖ్యంగా కాళ్లు, చేతులు, ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కమిలిపోకుండా ఉంటుంది.
* ప్రయాణాల్లో బయట ఆహారం తీసుకోకపోవడం ఉత్తమం. ఈ కాలంలో త్వరగా చెడిపోతుంది. వాటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకెళ్లాలి. పండ్లు, తేలికపాటి పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
* వాంతులు, వీరేచనాలు, శరీరం తీవ్రంగా వేడెక్కడం, నాలుగైదు గంటల వరకు మూత్రం రాకపోవడం, చర్మం వదులుగా మారడం, స్పృహ తప్పి పడిపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి.
* టైట్ జీన్స్, మందపాటి దుస్తులు ధరించకూడదు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు మేలు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)