logo

పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు

పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్‌ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది.

Published : 29 Mar 2024 02:57 IST

నాగలపల్లి వద్ద పాకలు ఏర్పాటుచేసుకున్న గిరిజన నిర్వాసితులు

దేవీపట్నం, న్యూస్‌టుడే: పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్‌ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. ముంపు గ్రామాల్లో గిరిజనులకు జీడిమామిడి, మామిడి తోటలు ఉండటంతో ఆయా ఉత్పత్తులు సేకరించేందుకు తాత్కాలికంగా తాటాకు పాకలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడే ఉంటూ జీడి పిక్కలను మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి అమ్మకాలు చేపడతారు. ఇప్పటికే నాగలపల్లి గిరిజనులు అక్కడే పాకలు వేసుకుని ఉంటున్నారు. దేవీపట్నం పరిసర ప్రాంతాల నిర్వాసితులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. కొండమొదలు పంచాయతీలోని కొన్ని కుటుంబాలు జీడిమామిడి పంట కోసం అక్కడే ఉంటున్నాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని