logo

పోక్సో కేసులో ప్రిన్సిపల్‌కు ఐదేళ్ల జైలు

ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్‌ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.

Published : 20 Apr 2024 01:44 IST

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్‌ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. దీనికి సంబంధించి ఎస్సై రవీంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... 2018లో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నరసింహమూర్తి అదనపు బాధ్యతలపై ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఆమె జవాబుపత్రాలు మార్చేసి బాలిక పరీక్షలో ఫెయిల్‌ అవ్వడానికి కారణమయ్యారు. దీనిపై బాలిక, కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదైంది. విచారణ అనంతరం విశాఖపట్నంలోని స్పెషల్‌ పోక్సో కోర్టు పైవిధంగా శిక్ష విధించినట్లు ఎస్సై వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని