logo

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ కేటగిరీల అధికారులు, సిబ్బందితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గురువారంతో ముగిసింది.

Published : 10 May 2024 01:56 IST

అరకులోయలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటేసిన ఉద్యోగులు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ కేటగిరీల అధికారులు, సిబ్బందితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గురువారంతో ముగిసింది. జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి జరిగిన పోలింగ్‌లో మొత్తం 9,828 మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. 11,446 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

అరకులోయ: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గురువారంతో ముగిసింది. నియోజకవర్గంలో మొత్తం 3017 మంది ఇందులో పాల్గొన్నారు. గురువారం 171 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల కోసం 3868 మంది దరఖాస్తు చేసుకోగా.. 3017 మంది ఓటేశారు.

రంపచోడవరం: రంపచోడవరం నియోజకవర్గంలో 4048 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 3742 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆర్వో ప్రశాంత కుమార్‌ తెలిపారు.

పాడేరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న వాహన డ్రైవర్లు, సిబ్బందికి మొదటిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించడంతో పాడేరు మోటర్‌ జీప్‌ యూనియన్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారిగా 50 మంది డ్రైవర్లు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని