logo

వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం

వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 10 May 2024 02:12 IST

గూడెంకొత్తవీధిలో మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి ఈశ్వరి

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. గూడెంకొత్తవీధిలో గురువారం తెదేపా, జనసేన, భాజపాల నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గిరిజన చట్టాలు, హక్కులను వైకాపా సర్కారు కాలరాసిందని విమర్శించారు. అక్రమ అరెస్ట్‌లు, భూ కబ్జాలతో ఇబ్బందులు పెట్టిందన్నారు. అభివృద్ధి జాడే కనిపించలేదని మండిపడ్డారు. గూడెంకొత్తవీధి జడ్పీటీసీ సభ్యురాలు శివరత్నం, ఎస్టీ కమిషన్‌ సభ్యుడైన ఆమె భర్త గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. తనను, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గూడెం కాలనీకి చెందిన మహిళలు, యువకులు, గుమ్మళ్లగొంది గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఈశ్వరి సమక్షంలో తెదేపాలో చేరారు. అనంతరం జీకే వీధి వారపు సంతలో ప్రచారం చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకటరమేష్‌నాయుడు, నాయకులు పాండురంగస్వామి, చల్లంగి లక్ష్మణరావు, పాండురాజు, బాలరాజు, సిద్దు, బోండ్ల చిరంజీవి, కాకురి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని