logo

దత్తత గ్రామం... అభివృద్ధి పథం

రామోజీ ఫౌండేషన్‌ దత్తత గ్రామం పెదపారుపూడిలో నిర్మించిన పలు భవనాలను మార్గదర్శి ఎండీ సీహెచ్‌ శైలజాకిరణ్‌ ఆదివారం ప్రారంభించారు.

Published : 06 Feb 2023 05:52 IST

తరగతి గదిలో చిన్నారులతో ముచ్చటిస్తున్న మార్గదర్శి చిట్ఫండ్స్‌ ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌

పెదపారుపూడి, న్యూస్‌టుడే : రామోజీ ఫౌండేషన్‌ దత్తత గ్రామం పెదపారుపూడిలో నిర్మించిన పలు భవనాలను మార్గదర్శి ఎండీ సీహెచ్‌ శైలజాకిరణ్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సీతారామస్వామి దేవాలయం, శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు శైలజాకిరణ్‌కు స్వాగతం పలికారు. జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచి చప్పిడ సమీర, గుడివాడ డివిజన్‌ సహకార శాఖ అధికారిణి విజయలక్ష్మి, జనరల్‌ మేనేజర్‌ ఎం.శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు తుమ్మల కోటేశ్వరరావు, వేతన కార్యదర్శి నాగరాజు, పాఠశాలల హెచ్‌ఎంలు భవాని, సౌజన్య, మాజీ ఎంపీపీ కాజా విజయలక్ష్మి, పాల కేంద్రం అధ్యక్షుడు పునుకొల్లు రత్నప్రసాద్‌ (నాని), పునుకొల్లు శివరామకృష్ణ ప్రసాద్‌, గారపాటి బాబురావు, చప్పిడి కిషోర్‌, పాలడుగు చంద్రశేఖర్‌, ‘ఈనాడు’ విజయవాడ యూనిట్‌ ఇన్‌ఛార్జి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన
మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం

పెదపారుపూడిలో నిర్మించిన పశువైద్యశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని