logo

‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉద్యమిస్తాం’

పోలవరం ప్రాజెక్టు ఎత్తుతగ్గిస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి టి.తాతయ్య హెచ్చరించారు.

Published : 28 Mar 2023 04:45 IST

దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు ఎత్తుతగ్గిస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి టి.తాతయ్య హెచ్చరించారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం  పలువురు నాయకులు మచిలీపట్నంలోని ధర్నాచౌక్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించిన రోజున 156 అడుగుల ఎత్తు, 1.96 లక్షల క్యూసెక్కుల నీరు నిల్వ చేసేందుకు అనువుగా  ఏర్పాట్లు చేశారని అన్నారు. ప్రస్తుతం దానిని 136 అడుగుల ఎత్తుకు కుదించడం సబబుకాదన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం  ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షుడు ఎ.సురేంద్రనాథ్‌ బెనర్జీ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయి, ఉన్న భూములు కూడా ఇచ్చి నిర్వాసితులుగా మారిన రైతులకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు దగాని సంగీతరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు లింగం ఫిలిప్‌, నాయకులు తుమ్మా చినకొండయ్య, వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాజబాబు, బళ్ల సుబ్బారావు, లక్ష్మణరావు, రత్నకుమారి, చైతన్యకుమార్‌, కోటిలింగం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని