logo

ఎన్నికల పరిశీలకుల నియామకం

సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్‌ ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐపీఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు.

Published : 30 Apr 2024 06:44 IST

కృష్ణా విశ్వవిద్యాలయంలో లెక్కింపు కేంద్ర ఏర్పాట్లపై ఆరా తీస్తున్న పరిశీలకులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్‌ ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐపీఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం లోక్‌సభ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకుడిగా ఏఆర్‌ జాన్‌కింగ్స్‌లే(8712693649),  మచిలీపట్నం లోక్‌సభ వ్యయ పరిశీలకునిగా సీహెచ్‌ మనీష్‌కుమార్‌(8712693650) గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు బి.నరహరిసింగ్‌(8712693654), మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరుకు  ప్రవీణ్‌ మోహన్‌దాస్‌(8712693651), గన్నవరం, గుడివాడ, పెడనకు వికాస్‌చంద్రకరోల్‌(8712693652), మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ పోలీస్‌ పరిశీలకునిగా ఎ.ప్రసాద్‌ప్రలాద్‌(8712693653) లను నియమించారన్నారు. వీరికి సహాయకులుగా జిల్లాకు చెందిన అధికారులను నియమించినట్లు సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఉంటే నేరుగా పరిశీలకులను కలిసి తెలియజేయవచ్చన్నారు.

లెక్కింపు కేంద్రాల పరిశీలన

జిల్లాకు నియమితులైన ఎన్నికల పరిశీలకులు ఆరుగురు సోమవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్ర, స్ట్రాంగ్‌రూంలను సందర్శించి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. సర్వే శాఖ ఏడీ మనీషాత్రిపాఠి ఓట్ల లెక్కింపు కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలను వారికి వివరించారు.విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానమణి, రిజిష్టార్‌ శోభన్‌బాబు, ఏఎస్పీ ఎస్‌వీడీ ప్రసాద్‌, బందరు డీఎస్పీ అబ్దుల్‌సుభాన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని