logo

నివేద.. అనంత ఫిదా

సినీనటి నివేద పేతురాజ్‌ శనివారం అనంత నగరంలో సందడి చేసింది. సుభాష్‌రోడ్డులోని సోనోవిజన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన జీఆర్‌ శుభమ్‌గ్రాండ్‌ వస్త్ర షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది. ఈమె అనంతకు వస్తుందని తెలుసుకొన్న యువత, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందరూ బాగున్నారా.. అ

Published : 22 May 2022 04:33 IST

దుకాణంలో చీరను పరిశీలిస్తున్న సినీ నటి నివేద పేతురాజ్‌

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: సినీనటి నివేద పేతురాజ్‌ శనివారం అనంత నగరంలో సందడి చేసింది. సుభాష్‌రోడ్డులోని సోనోవిజన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన జీఆర్‌ శుభమ్‌గ్రాండ్‌ వస్త్ర షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది. ఈమె అనంతకు వస్తుందని తెలుసుకొన్న యువత, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందరూ బాగున్నారా.. అనంతపురం ఎంతో బాగుంది. మొదటిసారి ఇక్కడికి వచ్చాను. ఎంతో నచ్చింది. అంటూ పలకరించారు. నిర్వాహకులు సురేష్‌కుమార్‌, గోకుల్‌ రవి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

శుభమ్‌గ్రాండ్‌ ప్రవేశద్వారాన్ని అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఎంపీ తలారి రంగయ్య జ్యోతి వెలిగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతపురంలో ప్రశాంత వాతావరణం ఉన్నందున పెద్దపెద్ద వాణిజ్యసంస్థలు షాపింగ్‌మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్‌ మహమ్మద్‌వసీం, జిల్లా పరిషత్తు మాజీ ఛైర్‌పర్సన్‌ తోపుదుర్తి కవిత, ఉపమేయర్లు వాసంతిసాహిత్య, కొగటం విజయభాస్కరరెడ్డి, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఫయాజ్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని