logo

అనంతలో సినీ తారల సందడి

అనంతలో సినీ తారలు సందడి చేశారు. ఆదివారం నగర శివారు బళ్లారిరోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌హాల్లో సీసీసీ-2022 (సినీ స్టార్స్‌ క్రికెట్‌) కప్‌ను సినీ తారలతో కలిసి సీసీసీ ఛైర్మన్‌ షకీల్‌ షఫీ, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో శివారెడ్డి, అడిషనల్‌ డీజీపీ సంజయ్‌ ఆవిష్కరించారు

Updated : 27 Jun 2022 06:17 IST

సినీ స్టార్స్‌ క్రికెట్‌ కప్‌ను సినీ తారలతో కలిసి ఆవిష్కరిస్తున్న సీసీసీ ఛైర్మన్‌ షకీల్‌ షఫి

బళ్లారిరోడ్డు: అనంతలో సినీ తారలు సందడి చేశారు. ఆదివారం నగర శివారు బళ్లారిరోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌హాల్లో సీసీసీ-2022 (సినీ స్టార్స్‌ క్రికెట్‌) కప్‌ను సినీ తారలతో కలిసి సీసీసీ ఛైర్మన్‌ షకీల్‌ షఫీ, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో శివారెడ్డి, అడిషనల్‌ డీజీపీ సంజయ్‌ ఆవిష్కరించారు. ‘సే నో టు డ్రగ్స్‌, ప్లాస్టిక్‌’ అనే నినాదంతో సినీ తారల క్రికెట్‌ పోటీలను నిర్వహించన్నుట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబరు 11వ తేదీన అనంతపురం ఆర్డీటీ మైదానంలో పోటీలు ఉంటాయన్నారు. దాదాపు 28 మంది సినీ తారలు సందడి చేశారు. జబర్దస్త్‌ బృందం అప్పారావ్‌, కార్తిక్‌, వినోదిని, జీవన్‌ తమ నటనతో హాస్యం పుట్టించారు. సినిమా పాటలకు డ్యాన్సర్లు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ గౌస్‌ మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని