logo

‘పరిహారం ఎందుకు అందలేదో రైతులకు చెప్పండి’

పంట నష్ట పరిహారం అందని బాధిత రైతుల నుంచి అర్జీలు తీసుకుని, ఏ కారణంతో అందలేదో వివరంగా చెప్పాలని జేసీ కేతన్‌గార్గ్‌ సూచించారు. సోమవారం అనంత కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం జరిగింది.  

Published : 28 Jun 2022 04:50 IST

మాజీ సైనికోద్యోగి మహబూబ్‌ బాషాను బలవంతంగా తీసుకెళుతున్న పోలీసులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: పంట నష్ట పరిహారం అందని బాధిత రైతుల నుంచి అర్జీలు తీసుకుని, ఏ కారణంతో అందలేదో వివరంగా చెప్పాలని జేసీ కేతన్‌గార్గ్‌ సూచించారు. సోమవారం అనంత కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం జరిగింది.  మొత్తం 356 మంది అర్జీలు స్వీకరించారు.  కొందరు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జేసీ జిల్లా అధికారులతో మాట్లాడారు. రైతుల నుంచి వచ్చే అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతి అర్జీకి 48 గంటల్లో పరిష్కారం చూపాలి.

* అనంత నగరం రహమత్‌నగర్‌కు చెందిన మాజీ సైనిక ఉద్యోగి మహబూబ్‌ బాషా రస్తా విషయంలో జేసీతో వాదనకు దిగారు. రహదారిపై కొందరు ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పెద్దగా అరుస్తుండటంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.

* వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ ప్లస్‌ అమలుకు చెందిన మెనూ ఛార్జీలు పెంచాలని ఏపీ అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకుల సంఘం కోరింది. ఆ సంఘం జిల్లా నాయకులు శకుంతల, శ్రీదేవి, జమున, నక్షత్ర, తదితరులు అర్జీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని