logo

అధికారుల నిర్లక్ష్యం.... గ్రామస్థులకు శాపం

నెలలు గడుస్తున్నా పాలకులు శ్రద్ధ చూపకపోవడంతో  అనంతపురం గ్రామీణ పరిధిలోని కందుకూరులో పారిశుద్ధ్యం పడకేసింది.

Published : 03 Dec 2022 02:35 IST


శివాలయం వీధిలో పేరుకుపోయిన మురుగు

కందుకూరు, న్యూస్‌టుడే: నెలలు గడుస్తున్నా పాలకులు శ్రద్ధ చూపకపోవడంతో  అనంతపురం గ్రామీణ పరిధిలోని కందుకూరులో పారిశుద్ధ్యం పడకేసింది. పలు ప్రాంతాల్లో మురుగుకాలువలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగుతో రోడ్లు నిండాయి. వాల్మీకి విగ్రహం వెనక, ఎస్సీ కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. దోమలు, పందులకు నిలయంగా మారడంతో గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. చెత్త తరలించే వాహనాలు శిథిలవడంతో పలు వీధుల్లో చెత్త పేరుకు పోయింది.

గ్రామసచివాలయంలో వృథాగా చెత్తతరలించే వాహనాలు


త్వరలోనే సీసీరోడ్డు వేస్తాం

సీసీ రోడ్డు తక్కువ ఎత్తులో ఉన్నందున మురుగు, వర్షం నీరు నిలబడి బురదమయంగా మారింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గతవారం మండల ఇంజినీరు వచ్చి కొత్తరోడ్డు నిర్మాణానికి కొలతలు తీసుకువెళ్లారు. 150మీటర్లు సీసీరోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

నరసింహరెడ్డి, పంచాయతీ కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని