logo

ధర్మవరం వాసికి కేంద్ర పురస్కారం

అజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన కథలు సేకరించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక పరిశోధన శిక్షణ కేంద్రం డీడీఆర్‌ (డిజిటల్‌ డిస్ట్రిక్ట్‌ డిపాజిటరీ) ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

Published : 27 Mar 2023 05:22 IST

పురస్కారం అందుకుంటున్న సరళ

ధర్మవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : అజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన కథలు సేకరించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక పరిశోధన శిక్షణ కేంద్రం డీడీఆర్‌ (డిజిటల్‌ డిస్ట్రిక్ట్‌ డిపాజిటరీ) ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సోమిశెట్టి సరళ 150 కథలు పంపారు. దక్షిణ భారత్‌ నుంచి అత్యధికంగా ఆమె కథలు పంపడంతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ మేరకు ఆదివారం దిల్లీలో జరిగిన అమృత్‌ రత్న లైవ్‌ షోలో సీసీఆర్‌టీ ఛైర్మన్‌ వినోద్‌ నారాయణ్‌ ఇందూర్కర్‌, డైరెక్టర్‌ రిషి, భారత సంగీత నృత్యనాటక అకాడమీ ఛైర్మన్‌ సంధ్య సరళను సన్మానించి పురస్కారం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని