logo

తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణమయ్యే విద్యార్థులకు సంపూర్ణ అవగాహన ఉండాలని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సూచించారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని

Published : 05 Dec 2021 05:59 IST

తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి


ప్రసంగిస్తున్న తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి

తిరుపతి(ఎస్వీయూ): ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణమయ్యే విద్యార్థులకు సంపూర్ణ అవగాహన ఉండాలని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సూచించారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్‌హాల్‌లో తిరుపతి సిటీ ఛాంబర్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ‘అమెరికాలో విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు’ అంశంపై శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తానా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వస్తున్న తెలుగు విద్యార్థులకు దశాబ్దాల కాలంగా తానా అండగా నిలుస్తోందని గుర్తు చేశారు. వీసా సమస్యలు, ఉపాధి అవకాశాల కల్పనలోనూ సహకారం అందిస్తోందన్నారు. అమెరికా వర్సిటీల్లో ప్రవేశాలు పొందే తెలుగు విద్యార్థులు.. సదరు విశ్వవిద్యాలయం నిబంధనలను పూర్తిగా తెలుసుకుని ముందడుగు వేయాలని సూచించారు. ఎస్వీయూ వీసీ ఆచార్య రాజారెడ్డి, తుడా ఉపాధ్యక్షులు హరికృష్ణ, సిటీ ఛాంబర్‌ అధ్యక్షులు అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. తానా అధ్యక్షుడు స్వయంగా వచ్చి విద్యార్థుల సందేహాలకు సలహాలివ్వడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి శ్రీహరి, సిటీ ఛాంబర్‌ వ్యవస్థాపక కార్యదర్శి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని