logo

శివయ్య.. పెళ్లిపిలుపు

శివయ్య పెళ్లిపిలుపునకు నాందీగా నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఏటా రెండు దఫాలు నిర్వహించే ఈ విశేషోత్సవంతో ఆదివారం కైలాసగిరులు పులకించిపోయాయి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీసోమస్కందమూర్తి, జ్ఞానాంబికల కల్యాణోత్సవానికి ఏటా కైలాసగిరుల్లోని పరివారాన్ని,

Published : 17 Jan 2022 03:13 IST

‘ప్రదక్షిణం’.. పులకించిన కైలాసం


పురవీధుల్లో ఊరేగుతున్న ఉత్సవర్లు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శివయ్య పెళ్లిపిలుపునకు నాందీగా నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఏటా రెండు దఫాలు నిర్వహించే ఈ విశేషోత్సవంతో ఆదివారం కైలాసగిరులు పులకించిపోయాయి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీసోమస్కందమూర్తి, జ్ఞానాంబికల కల్యాణోత్సవానికి ఏటా కైలాసగిరుల్లోని పరివారాన్ని, ప్రథమ గణాలు, రుషులు ఇలా అందరినీ ఆహ్వానించేందుకు దేవదేవుడు దేవేరీ వెంట వెళ్లడం, బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తయ్యాక మళ్లీ వెళ్లి వీడ్కోలు పలికి రావడమే గిరిప్రదక్షిణ ఉత్సవ అంతరార్థం. ఊరందూరులోని శ్రీఅన్నపూర్ణా సమేత నీలకంఠేశ్వరస్వామి బయలుదేరి వెళ్లారు. అశేష రీతిలో భక్తులు దేవతామూర్తులతో కదలివచ్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా దారిలో ఏర్పాట్లు లేవు. అయినా స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి భక్తుల ఆకలి కష్టాలను తీర్చారు. గిరిప్రదక్షిణోత్సవం పురస్కరించుకుని 21 కిలోమీటర్ల పాటు సాగిన ఉత్సవంలో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, ఈఈ వెంకటనారాయణ, డిప్యూటీ ఈవో ఎన్‌.ఆర్‌.కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమారై, కుమారుడు పవిత్ర, ఆకర్ష్‌, ఏఈవో ధనపాల్‌, సూపరింటెండెంట్లు సారథి, నాగభూషణం, తనిఖీ అధికారి హరియాదవ్‌, వెంకటముని పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని