logo

ఏసీఆర్‌ను వెంటనే పంపాలి

ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఐదేళ్ల ఏసీఆర్‌(యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌)లు వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుకు డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలు విన్నవించారు.

Published : 18 Jan 2022 04:52 IST

జడ్పీ ఛైర్మన్‌కు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

చిత్తూరు జడ్పీ: ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఐదేళ్ల ఏసీఆర్‌(యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌)లు వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుకు డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలు విన్నవించారు. జడ్పీ కార్యాలయంలో సోమవారం ఆయన్ను.. వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఛైర్మన్‌ హామీ ఇచ్చారు. సీఈవో ప్రభాకరరెడ్డి, చిత్తూరు, తిరుపతి డీఎల్‌డీవోలు రాధమ్మ, ఆదిశేషారెడ్డి, ఎంపీడీవోలు వెంకటరత్నం, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని