logo

సర్వేశ్వ రుడికే ఎరుక !

న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి నియంత్రణకు.. బాధితులను గుర్తించి త్వరితగతిన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన జ్వర సర్వేలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.  జ్వరాలను గుర్తించి.. పరీక్షలు నిర్వహించి.. వ్యాధి నిర్ధారణ చేసి.. వైద్య సేవలను అందించాలని గొప్ప

Published : 20 Jan 2022 05:26 IST

ఇదీ జిల్లాలో జ్వర సర్వే పరిస్థితి 
సొంత లెక్కలు వేస్తున్న సిబ్బంది

సిబ్బందికి సూచనలిస్తున్న రాష్ట్ర పరిశీలకుడు ఆర్‌.ఆర్‌.రెడ్డి (పాతచిత్రం)

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి నియంత్రణకు.. బాధితులను గుర్తించి త్వరితగతిన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన జ్వర సర్వేలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.  జ్వరాలను గుర్తించి.. పరీక్షలు నిర్వహించి.. వ్యాధి నిర్ధారణ చేసి.. వైద్య సేవలను అందించాలని గొప్ప లక్ష్యమున్నా.. సిబ్బంది సొంత లెక్కలు వేస్తూ తూతూమంత్రంగా చేపడుతున్నారు. 
జిల్లాలో రెండేళ్లలో 34 జ్వర సర్వేలు చేశారు. కొవిడ్‌ ఉద్ధృతమయ్యేలోగా 35వ సర్వే చేయాలని భావించినా 55.38 శాతం మాత్రమే పూర్తయింది. ప్రతి సచివాలయం పరిధిలోని వార్డు వాలంటీర్లు, ఆశా కార్యర్తలు, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి.. ఆరోగ్య పరంగా పలు ప్రశ్నలను అడగాలి. వాలంటీరు యాప్‌లో ఉన్న సుమారు 33 అనారోగ్య సమస్యలకు సంబంధించి వివరాలు నమోదు చేయాలి. వాటి ఆధారంగా సదరు ఆరోగ్య సిబ్బంది మళ్లీ కుటుంబ సభ్యులను పలకరించి.. జ్వరం, దగ్గు ఉన్నట్లు తేలితే.. ఆరోగ్య సిబ్బంది డెంగీ, మలేరియా, కొవిడ్‌.. తదితర పరీక్షలు చేసి వాటి ఫలితాలు వెల్లడించాలి. జ్వరం, దగ్గు ఉన్న బాధితులకు కొవిడ్‌ కిట్లను అందించి, వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌ ఉండాలని సూచించి.. పర్యవేక్షించాలి. ఇలా కొన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా జరుగుతున్నా.. అత్యధిక ప్రాంతాల్లో యాప్‌లో ఉన్న అన్ని కాలమ్స్‌కు లేదు.. లేదు.. లేదు అని అప్‌లోడ్‌ చేస్తున్నారనే విమర్శలున్నాయి.  ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో పకడ్బందీగా జరిగితే సాధారణ జ్వరాలు, కొవిడ్‌ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. 
3,316 పరీక్షలు.. 1,822 కేసులు
జిల్లాలో గత 24 గంటల్లో 3,316 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 1,822 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఒకరు మృతి చెందారు. తిరుపతిలో 506, చిత్తూరులో 266, మదనపల్లెలో 86, శ్రీకాళహస్తిలో 84, చంద్రగిరిలో 81, పుత్తూరులో 56, పాకాలలో 50, పూతలపట్టులో 46 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ పరిధిలో 19 వేల కిట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. పీహెచ్‌సీలకు వెళ్తే పరీక్షల కోసం రెండు, వ΄డ్రోజులు ఆగాలనే సమాధానం వస్తోంది.


పూతలపట్టు: కొవిడ్‌ భయంతో విద్యార్థులను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని