Crime News: రేణిగుంటలో దారుణం:భర్తను నరికి.. అతడి తలతో పీఎస్‌కు వెళ్లిన భార్య
చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది.
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర.. తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది. అనంతరం ఆ తలను సంచిలో తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితురాలిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి వెళ్లారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
నగర శివారు బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. -
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్‌స్టా లైవ్.. బోగస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
గుజరాత్‌లోని దాహోద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్‌స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
కేరళలో ఏనుగు దాడి.. కెమెరామన్ దుర్మరణం
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్‌గా, కాలమిస్ట్‌గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్‌ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేఎల్‌తో సంజీవ్ గోయెంకా సీరియస్ చాటింగ్ .. నెట్టింట హాట్ టాపిక్
-
విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
-
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
-
సందేశ్‌ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి