Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 May 2024 13:10 IST

1. బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్‌: నగర శివారు బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఆరుగురిని అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్‌ ఇంజినీర్‌ సతీష్‌, ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సిస్‌, గుత్తేదారు రాజేశ్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. పూర్తి కథనం

2. టోల్‌ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అయి

మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) కాన్వాయ్‌ను ఓ వ్యక్తి కారులో అనుసరించాడు. దీనిని గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?పూర్తి కథనం

3. ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా... ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా: వైఎస్‌ షర్మిల

ఎంపీగా అవినాష్‌రెడ్డి కడప స్టీల్‌ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారు. అవినాష్‌ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నాం. కాల్‌ రికార్డ్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఆధారాలన్నీ ఉన్నాయి.పూర్తి కథనం

4. డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చిన్న కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌ (Barron Trump) రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ‘రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా పంపనున్నట్లు పార్టీ ఛైర్మన్‌ ఇవన్‌ పవర్‌ బుధవారం వెల్లడించారు.పూర్తి కథనం

5. కాంగ్రెస్‌కు అదానీ, అంబానీ డబ్బు పంపుతుంటే ఈడీ ఏం చేస్తోంది?: కేటీఆర్‌

నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ ఇటీవల సభలో మాట్లాడిన ప్రకారం.. కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతుంటే.. ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీశారు. పూర్తి కథనం

6. భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!

మ కలల ప్రాజెక్టు ‘నియోమ్‌’(Neom)కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా (Saudi Arabia) ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే అస్సలు కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కర్నల్‌ రభిహ్‌ ఎలెన్జీ బీబీసీ సంస్థకు వెల్లడించారు.పూర్తి కథనం

7. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్‌

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లను సీజ్‌ చేశారు. నగదును హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.పూర్తి కథనం

8. ఉద్యోగులకు ఏఐఎక్స్‌ షాక్‌.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం

క్యాబిన్‌ సిబ్బందిలో 25 మందిని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) తొలగించింది. మిగిలిన వారు గురువారం సాయంత్రం 4 గంటల్లోగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే అందరినీ తొలగిస్తామని హెచ్చరించింది.పూర్తి కథనం

9. ఆ విధ్వంసమేంటి? ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్

ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి భారీ భాగస్వామ్యంతో లఖ్‌నవూను చిత్తు చేశారు. పవర్‌ ప్లేలోనే 100కిపైగా పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ అలవోకగా విజయం సాధించింది. లఖ్‌నవూ నుంచి ఐదుగురు బౌలర్లు బంతులేసినా ప్రతి ఒక్కరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. పూర్తి కథనం

10. మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్‌ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్

లఖ్‌నవూపై హైదరాబాద్ ఓపెనర్లు విజృంభించారు. అలవోకగా సిక్స్‌లు, ఫోర్లు కొట్టిన తీరును అందరూ అభినందిస్తున్నారు.ప్రత్యర్థి కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్‌ ఫలితంపై ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని.. ఇదంతా అభిషేక్ శర్మ, ట్రావిస్‌ హెడ్ అద్భుత నైపుణ్యమని కేఎల్ వ్యాఖ్యానించాడు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని