TCS CEO Salary: 2023-24లో టీసీఎస్‌ సీఈఓ వేతనం రూ.25 కోట్లు

TCS CEO Salary: టీసీఎస్‌ సీఈఓ కృతివాసన్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అదే సమయంలో సీఓఓ గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు.

Published : 09 May 2024 13:04 IST

బెంగళూరు: ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌’ సీఈఓ కె.కృతివాసన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.25.4 కోట్ల వేతనాన్ని (TCS CEO Salary) అందుకున్నారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు కంపెనీ బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక సేవల విభాగాధిపతిగా.. జూన్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సీఈఓ హోదాలో ఈ వేతనాన్ని పొందారు. గత ఏడాది జూన్‌ 1న ఆయన సీఈఓ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

టీసీఎస్‌ మాజీ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ 2022-23లో రూ.29.16 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. మరోవైపు 2023-24లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (COO) గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు. ఆయన వేతనం వార్షిక ప్రాతిపదికన 8.2 శాతం పెరిగింది. భారత్‌లో కంపెనీ ఉద్యోగుల వేతనం సగటున 5.5 నుంచి 8 శాతం పెరిగింది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు అన్నీ పరిగణనలోకి తీసుకుంటే పెంపు 7-8 శాతం వరకు ఉన్నట్లు వార్షిక నివేదిక వెల్లడించింది. మెరుగైన ప్రతిభ కనబర్చిన కొంతమంది జీతంలో రెండంకెల వృద్ధి కూడా నమోదైంది.

భారత్‌ వెలుపల పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు 1.5 నుంచి 6 శాతం వరకు పెరిగాయి. ఆయా దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా జీతాలు పెంచామని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని